కన్నీటి వీడ్కోలు
ఘనంగా చంద్రమౌళి అంత్యక్రియలు పాడె మోసిన మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేశ్ కన్నీటి పర్యంతమైన కుటుంబీకులు, బంధుమిత్రులు జయజయహే : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ హిందూ శ్మశాన వాటికలో చంద్రమౌళి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. చంద్రమౌళి అంత్యక్రియలో మంత్రులు, కూటమి నేతలు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రమౌళి అంతిమ సంస్కారాలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై వీడ్కోలు పలికారు. చంద్రమౌళి కుటుంబానికి కూటమి ప్రభుత్వం...