సుపరిపాలన లో తోలి అడుగు కార్యక్రమంలో
ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
నందవరం,శివసూర్య,జూలై 5:
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోనే మంచి పరిపాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరు నియోజవర్గ ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నందవరం ఎస్సీ కాలనీ, కలగొట్ల గుడి వీధి, లింగాయత్ వీధి, తెలుగు వీధి, బుక్కుట్ల వీధి, మునుస్వామి దేవాలయం వీధిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసి నందవరం గ్రామంలో కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకొని తెలుగుదేశం పార్టీకి ముఖ్య నాయకులు ఇంటి దగ్గరికి వెళ్లి ప్రశంసించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ కే మల్లయ్య, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేశాయి మాధవరావు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ పుష్పావతి, మండల సహకార సొసైటీ చైర్మన్ గోపాల్,మండల టిడిపి కన్వీనర్ ఖాసిం వలి, మాజీ మండల కన్వీనర్ చిన్న రాముడు,నందవరం గ్రామ అధ్యక్షులు భీమ శేఖర్, మాజీ ఎంపిటిసి తిమ్మరాజు, బూత్ కన్వీనర్లు, నరసింహ, టి ఈరన్న, వెంకటేష్, వీరేష్, గోపి, దేవల్ల లక్షప్ప, తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.