ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీ, కాంతి రాణా టాటా లపై చర్యలోద్దు .! హైకోర్టు కీలక ఆదేశాలు..!

జయజయహే : ముంబై నటి కాదంబరీ జెత్వానీపై గత వైసీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు అరెస్టు చేసి వేధించారని ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు పలువురు ఇతర పోలీసు అధికారులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబైలో ఓ పారిశ్రామికవేత్త పై ఆమె పెట్టిన రేప్ కేసును వెనక్కి తీసుకునేలా ఆమెను ఒప్పించేందుకు ఈ వేధింపుల ఎపిసోడ్ చేపట్టారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి ఇవాళ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనను, తన కుటుంబ సభ్యుల్ని అరెస్టు చేసి వేధించారంటూ నటి...