ఏపీలో రేషన్ దుకాణాలు ప్రారంభం : రాత్రి 8 గంటల వరకూ

చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై నెలలో 15 రోజులపాటు ఈ నిత్యావసర సరుకులను రేషన్ కార్డుదారులకు అందజేయనుంది. ఈ 15 రోజుల పాటు కూడా రెండు పూటలా పంపిణీ ఉంటుంది. ఈ మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు చేర్పులను చేపట్టింది. ఈ నెల నుంచే ఇవి...