ఏపీలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ -దరకాస్తు చేసుకున్న 21 రోజులలోనే కార్డు మంజూరు ..నాదెండ్ల మనోహర్

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమవుతున్న ప్రభుత్వం.. ఇవాళ మరికొన్ని కీలక ప్రకటనలు చేసింది. ఇందులో రేషన్ కార్డు దరఖాస్తుల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించినట్లు తెలిపింది. అలాగే వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు రేషన్ కార్డుల దరఖాస్తులకు ఇచ్చిన గడువును పూర్తిగా తొలగించింది. ఇది నిరంతర ప్రక్రియ అని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. నూతన రేషన్ కార్డుల దరఖాస్తు, మార్పులు చేర్పులకు గడువు లేదని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న వారు ఎప్పుడైనా దరఖాస్తు...