SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 19 May 2025, 10:08 am Posted by : SHIVASURYA NEWS

ఏపీలో గర్భిణీ స్త్రీలకు శుభవార్త.. ఎన్టీఆర్ బేబీ కిట్లు పథకం తిరిగి పునరుద్ధరణ

51 కోట్ల 14 లక్షల 77 వేలు నిధులు విడుదల. ఒక్కో కిట్ కు 1410/- ఖర్చు పెట్టనున్న ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవం అయిన తల్లులకు కిట్లు అందించనున్నారు. 2016లో ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం ప్రారంభించారు. అయితే 2019 తరువాత బేబీ కిట్ పథకం ఆగిపోయింది.

బేబీ కిట్ పథకంలో ఏమేమి ఉంటాయి..

బేబీ కిట్‌లో దోమతెర, దుప్పటి, స్లీపింగ్ బెట్, యాంటీసెప్టిక్ లోషన్‌తో పాటుగా నాప్‌కిన్, డైపర్లు, షాంపూ వంటి 11 రకాల సామాగ్రి ఉంటుంది. ఈ కిట్‌లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉచితంగా అందజేస్తారు.