ఏపీలో కొత్తగా కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడంటే?

జయజయహే : ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను శరవేగంగా జరపాలని భావిస్తోంది. ఈనెల 2న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. గత పది నెలలుగా నిధుల సమీకరణ పై దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అవి కొలిక్కి రావడంతో పునర్నిర్మాణ పనులు ప్రారంభించింది. ప్రపంచ నగరాల్లోనే అమరావతిని ఉత్తమంగా నిలపాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. అందులో భాగంగా కీలక నిర్మాణాలను చేపడుతోంది. మరో తాజా నిర్ణయం తీసుకుంది. అమరావతి ముఖద్వారంగా ఉండే ప్రకాశం...