SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 10:10 am Posted by : SHIVASURYA NEWS

ఎస్కార్ట్ విధుల్లో అప్రమత్తత అత్యవసరం – జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

కైలాసగిరి : జయజయహే : ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్, కైలాసగిరి మైదానంలో శుక్రవారం జరిగిన స్టాఫ్ పరేడ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరేడ్ కమాండర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ మన్మధరావు నేతృత్వంలో, ఏ.ఆర్ డిఎస్పీ పి.నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్పీ వందనం అర్పించారు. అనంతరం పరేడ్‌ను సమీక్షించి, సిబ్బందిని అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,

“ఎస్కార్ట్ విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది అత్యధిక అప్రమత్తతతో వ్యవహరించాలి,” అని హితవు పలికారు. నిందితులను కోర్టు నుండి జైలుకు, జైలు నుండి కోర్టుకు తరలించే సందర్భాలలో అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను పాటించాలని, వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశమే లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. “తీవ్ర నేరాలకు పాల్పడిన నిందితుల విషయంలో వారి నేర చరిత్రను దృష్టిలో ఉంచుకుని మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి,” అని స్పష్టం చేశారు. గతంలో చోటుచేసుకున్న సంఘటనలను గుర్తుచేస్తూ, భవిష్యత్తులో అలాంటి తప్పులకు అవకాశం లేకుండా క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమం అనంతరం సిబ్బంది సంక్షేమం పై దృష్టి సారించిన ఎస్పీ, వారి ఆరోగ్యం, ఉద్యోగ సంబంధిత అంశాలు, మరియు వ్యక్తిగత వినతులపై సానుకూలంగా స్పందించారు. వాటిని పరిశీలించి, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్ మరియు ఏ.ఆర్ డిఎస్పీ పి.నాగేశ్వరరావు లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, ఏ.ఆర్ డిఎస్పీ పి.నాగేశ్వరరావు, ఏవో శ్రీ ఏ.రామ్ కుమార్, ఎస్‌బి ఇన్స్పెక్టర్ బాల సూర్యారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మధరావు, రమణమూర్తి, అరవింద్ కిషోర్, సంజీవరావు, ఆర్‌ఎస్‌ఐ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.