ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం స్వ‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మంలో జోన‌ల్ ప్ర‌త్యేక అధికారి బి.రాజ‌శేఖ‌ర్‌

విజ‌య‌న‌గ‌రం జయజయహే : ఇళ్లు, కార్యాల‌యాలు, వాణిజ్య, వ్యాపార సంస్థ‌ల్లో పాడైన ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, వ‌స్తువుల‌ను శాస్త్రీయ ప‌ద్ధ‌తుల్లో తొల‌గించ‌డం ఎంతో ముఖ్య‌మని ఉత్త‌రాంధ్ర జిల్లాల ప్ర‌త్యేక అధికారి, రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌శాఖ‌ల ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బి.రాజశేఖ‌ర్ అన్నారు. ఈ వ్య‌ర్ధాల‌ను స‌రైన రీతిలో తొల‌గించ‌క‌పోతే వాటి నుంచి వెలువ‌డే ర‌సాయ‌నాలు పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ఎంతో ప్ర‌మాద‌క‌రంగా ప‌రిణ‌మిస్తాయ‌ని చెప్పారు. ఇ-వ్య‌ర్ధాల‌ను శాస్త్రీయ విధానంలో తొల‌గించ‌న‌ట్ల‌యితే వాటి నుంచి వెయ్యి ర‌కాల ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలు వెలువ‌డ‌తాయ‌ని, వాటిని పీల్చిన గ‌ర్భిణీల‌కు, వారి గ‌ర్భంలోని...