ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. సమాజానికి సేవ చేయడానికి, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకున్నాయని పేర్కొన్నారు. సినిమా మాధ్యమంగా ఎన్టీఆర్.. యావత్ సమాజాన్ని చైతన్యవంతులు చేశారని మోదీ చెప్పారు. ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే సమాజంలో స్ఫూర్తినింపే సినిమాలు తీశారని అన్నారు. తాము అందరం ఎన్టీఆర్ నుండి ఎంతో ప్రేరణ పొందామని మోదీ నివాళి...