ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. సమాజానికి సేవ చేయడానికి, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకున్నాయని పేర్కొన్నారు.
సినిమా మాధ్యమంగా ఎన్టీఆర్.. యావత్ సమాజాన్ని చైతన్యవంతులు చేశారని మోదీ చెప్పారు. ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే సమాజంలో స్ఫూర్తినింపే సినిమాలు తీశారని అన్నారు. తాము అందరం ఎన్టీఆర్ నుండి ఎంతో ప్రేరణ పొందామని మోదీ నివాళి అర్పించారు. తన స్నేహితుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఏపీలో అదికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఎన్టీఆర్ ఆశయాలను సాధించడానికి, ఆయన దార్శనికతలో ప్రయాణించడానికి నిరంతరాయంగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.
Post
See new posts
Conversation
Narendra Modi
@narendramodi
Follow
I pay homage to NTR Garu on his birth anniversary. He is widely admired for his efforts to serve society and empower the poor and downtrodden. His cinematic works also continue to enthral audiences. We are all deeply inspired by him.
The NDA Government in Andhra Pradesh, led by my friend Chandrababu Naidu Garu is working to fulfil NTR’s vision.
@ncbn

