ఎక్కడున్నా వదిలిపెట్టం వీరయ్య హత్యను జీర్ణించుకోలేకున్నా నిందితుల కోసం 12 టీమ్ లు రంగంలోకి సీఎం చంద్రబాబు హెచ్చరిక

జయజయహే : టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వీరయ్య హత్యను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసిందని చెప్పారు. హత్య చేసిన నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 12 బృందాలతో దర్యాప్తు చేయిస్తున్నామన్నారు కరుడుగట్టిన నేరస్తులతో వీరయ్యను హత్య చేయించారని, 53 కత్తిపోట్లు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ఇలాంటివి చూసినప్పుడు రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరయ్య చౌదరి మంచి నాయకుడు, సమర్థమైన...