SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 7:46 am Posted by : SHIVASURYA NEWS

ఎం . కోడూరు మోదకొండమ్మ జాతర

మాడుగుల : జయజయహే: మాడుగుల మండలం ఎం కోడూరు గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర ఈనెల 4 వ తేదీన నిర్వహించడం ఉన్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు గ్రామ సర్పంచ్ గొల్లవిల్లి సంజీవరావు శుక్రవారం తెలిపారు. ఇందుకు సంబంధించి నెల రోజుల క్రితం గత నెల 5వ తేదీన గ్రామంలో అమ్మవారి శతకం పట్టు నెలరోజులు కొలువు ఏర్పాటు చేశారు. ఈ నెలరోజులపాటు అమ్మవారిని గ్రామస్తులు శతకం పట్టువద్దే దర్శించుకుంటారు. నాలుగున అమ్మవారి జాతర కాగా ముందు రోజు శనివారం రాత్రికి తోలేలు జాతర ను శతకం పట్టు వద్ద నిర్వహించడం జరుగుతుందన్నారు. తొలేలు జాతరలో 101 డబ్బులు,101కాగడాలతో భారీ మందు గుండు సామాగ్రి వెలుగులతో కీలుగుఱ్ఱములు ఏనుగులను గ్రామంలో ఊరేగించడం జరుగుతుందన్నారు. ఆదివారం ఉదయం అమ్మవారిని ప్రత్యేక పట్టు వస్త్రములతొను బంగారు వెండి ఆభరణములతోనూ పూల మాలలతోనూ అలంకరించి అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతాదన్నారు. అలాగే ఆదివారం సాయంత్రం నేలవేషములు బండ్లవేషములు తప్పిడి గుళ్ళు చిటికెల భజనలుతో పాటు వివిధ రకాల నేల డాన్సులతో అమ్మవారి ఊరేగింపు నిర్వహించడం జరుగు తాదని తెలిపారు. ఆరోజు రాత్రి గ్రామంలో వివిధ రకాల సాంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. కాబట్టి ప్రజలందరూ అమ్మవారి జాతరను జయప్రదం చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.