SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 08 May 2025, 8:21 am Posted by : SHIVASURYA NEWS

ఎండ మంటలే…..మళ్లీ వడగాలుల ముప్పు

విశాఖపట్నం: జయజయహే : ఏప్రిల్ నుంచి తగ్గు ముఖం పట్టిన వడగాలులు మళ్లీ ప్రభావం చూపే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గురువారం గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల మధ్యలో నమోదు కావొచ్చని, శుక్రవారం నుంచి తీవ్రత పెరగొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 15 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీకాకుళం, అనకాపల్లి, కాటి నాడ, తూర్పుగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. రాత్రి 7 గంటల వరకు అత్య ధికంగా కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 86. 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధ వారం సింహాద్రిపురం (వైఎస్సార్) లో 40,7, గుల్లదుర్తి (నంద్యాల), నేమకల్లు (కర్నూలు)లో 40.6, కాకాని (పల్నాడు)లో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.