ఉపముఖ్యమంత్రి సినిమాకు థియేటర్లు మూసేస్తారా ? ఆ నలుగురికీ మంత్రి దుర్గేష్ వార్నింగ్.. !

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లుకు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు షాకిచ్చారు. జూన్ 12న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుండగా.. జూన్ 1 నుంచి థియేటర్లు మూసేయాలని వారు నిర్ణయించారు. ప‌ర్సంటేజ్ సిస్ట‌మ్‌లో సినిమాలు రిలీజ్ చేయాల‌ని ఎగ్జిబిట‌ర్స్ కోరుతుండగా.. నిర్మాతలు దీనికి అంగీకరించడం లేదు. దీంతో అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపే పరిస్థితుల్లో లేమంటున్న ఎగ్జిబిటర్లు.. జూన్ 1 నుంచి దీనికి నిరసనగా థియేటర్లు మూసేయాలని నిర్ణయించారు. దీంతో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం విడుదలపై సస్పెన్స్...