ఉదృతంగా మారిన విశాఖ ఉక్కు కార్మికుల సమ్మె

తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఉక్కు కర్మాగారం కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరావధిక సమ్మె మంగళవారం ఉధృతంగా మారింది. అడ్మిన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్మికులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో కార్మికుల నాయకుడు భాస్కర్‌‌ అస్వస్థతకు గురయ్యారు.  ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉక్కు కర్మాగారం కాంట్రాక్టు కార్మికుల నిరావధిక సమ్మె మంగళవారం ఉధృతంగా మారింది. గత వారం రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్న ఉక్కు కాంట్రాక్టు...