ఉత్తమ నాటిక .. “(అ) సత్యం” ముగిసిన జాతీయస్థాయి నాటకోత్సవాలు

భీమవరం : జయజయహే : భీమవరం డిఎన్నార్ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న చైతన్య భారతి 18వ జాతీయస్థాయి నాటికల పోటీలు ఘనంగా ముగిశాయి. చైతన్య కళా స్రవంతి విశాఖపట్నం వారి "(అ) సత్యం" నాటిక ఉత్తమ ప్రదర్శన, సాయి ఆర్ట్స్ కొలకలూరు " జనరల్ బోగీలు" ద్వితీయ స్థానం, యువబేరి థియేటర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి "నా శత్రువు" నాటికలు తృతీయ స్థానాలు సాధించాయని చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ తెలిపారు. జ్యూరీ ప్రదర్శనగా అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారిచే "...