SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 8:28 am Posted by : SHIVASURYA NEWS

ఉత్తమ నాటిక .. “(అ) సత్యం” ముగిసిన జాతీయస్థాయి నాటకోత్సవాలు

భీమవరం : జయజయహే : భీమవరం డిఎన్నార్ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న చైతన్య భారతి 18వ జాతీయస్థాయి నాటికల పోటీలు ఘనంగా ముగిశాయి. చైతన్య కళా స్రవంతి విశాఖపట్నం వారి “(అ) సత్యం” నాటిక ఉత్తమ ప్రదర్శన, సాయి ఆర్ట్స్ కొలకలూరు ” జనరల్ బోగీలు” ద్వితీయ స్థానం, యువబేరి థియేటర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారి “నా శత్రువు” నాటికలు తృతీయ స్థానాలు సాధించాయని చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ తెలిపారు. జ్యూరీ ప్రదర్శనగా అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారిచే ” చిగురు మేఘం”, ఉత్తమ రచన నా శత్రువు, ఉత్తమ దర్శకత్వం బాలాజీ నాయక్ ((అ) సత్యం), ఉత్తమ నటుడు చెన్నయ్య పాత్రధారి కావూరి సత్యనారాయణ (చిగురు మేఘం), ఉత్తమ నటి సావిత్రమ్మ పాత్రధారిణి సురభి ప్రభావతి (జనరల్ బోగీలు), ఉత్తమ ప్రతి నాయకుడు సిఐ పాత్రధారి గోపరాజు విజయ్ (జనరల్ బోగీలు), ఉత్తమ హాస్యనటుడు పి కోటేశ్వరరావు (మా ఇంట్లో మహాభారతం), ఉత్తమ బాల నటుడు యశ్విత (నా శత్రువు), ద్వితీయ ఉత్తమ నటుడు చెరుకూరి సాంబశివరావు (కిడ్నాప్), ద్వితీయ ఉత్తమ నటి జ్యోతి రాణి (మా ఇంట్లో మహాభారతం), ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గంగోత్రి సాయి ( విడాకులు కావాలి) ఉత్తమ క్యారెక్టర్ నటి ఎం రత్నకుమారి (బ్రహ్మ స్వరూపం), ఉత్తమ రంగాలంకరణ పీవీ కుమార్ (బ్రహ్మ స్వరూపం), సంగీతం పై లీలమోహన్ (అ సత్యం), ఉత్తమ మేకప్ థామస్ (ఉక్కు సంకెళ్ళు), జ్యూరీ బహుమతి చిగురు మేఘం, ఇది రహదారి కాదు వంటి నాటికలకు అందించామని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా లమానాపురం సత్యనారాయణ, ఎల్ రుద్రమూర్తి, సుసుము నాగ భూషణములు వ్యవహరించారు. కార్యక్రమంలో మంతెన రామ్ కుమార్ రాజు, భట్టిప్రోలు శ్రీనివాసరావు ( బి ఎస్ ఆర్ ) బొండా రాంబాబు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, కట్రేడ్డి సత్యనారాయణ, పెన్నాడ శ్రీనివాస్,కృత్తివెంటి సత్యకూమర్, మెహన్, సుందరం, స్వామి తదితరులు పాల్గొన్నారు