ఉగ్ర దాడి అమానుషం – జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
యాత్రికులను కాపాడుతూ ప్రాణాలను అర్పించిన నిజమైన హీరో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా గుంటూరు : జయజయహే : పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రమూకలు దాడి చేసి 26 మందిని అమానుషంగా కాల్చి చంపడాన్ని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకు అతీతంగా దేశ సమగ్రతను కాపాడడానికి భారతీయులందరూ ఐక్యంగా ఉగ్రవాదం అంతమయ్యే వరకు ఉద్యమించాలన్నారు. జమ్ము కాశ్మీర్ లో అత్యధిక ఆదాయం టూరిజం ద్వారా వస్తుందని ,ఇలాంటి అమానుషమైన ఉగ్రదాడులతో టూరిజం పతనమవుతుందన్నారు. 2024 సంవత్సరంలో దాదాపు...