ఉగ్రవాదులను అప్పగించండి.. నీళ్లు ఇస్తాం: జై శంకర్‌ సంచలన వ్యాఖ్యలు

జయజయహే : సింధూ జలాల నిలిపివేతపై భారత విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధూ నదీజలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు. భారత్‌- పాక్‌ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్ పార్టీ జోక్యం అవసరంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ పాకిస్థాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు సింధూ నదీజలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని...