ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా ఖలీద్..? గుర్తించిన నిఘా వర్గాలు వేటాడుతున్న భద్రతా బలగాలు
జయజయహే : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం లో 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రధారి ఎవరనే కీలక సమాచారం వెలుగుచూసింది. లష్కరే తొయిబా టాప్ కమాండర్ సైఫుల్లా ఖలీద్ ఈ ఘటన వెనుక ప్రధాన సూత్రధారిగా ఆర్మీ వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రదాడికి రెండు నెలల నుంచి సైఫుల్లా ఖలీద్ అలియాస్ సైఫుల్లా కసూరి ప్లాన్ చేస్తున్నాడని, తన ప్లానింగ్ సజావుగా అమలు చేసేందుకు గత రెండు నెలల్లో రెండు సార్లు పాకిస్థాన్ ఆర్మీ క్యాంప్స్‌కు వెళ్లాడని భారత ఆర్మీ...