SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 11:12 am Posted by : SHIVASURYA NEWS

ఉగాది  ఉత్సవాలకు శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే కర్ణాటక భక్తులకు మజ్జిగ, బిస్కెట్లు  పంపిణీ చేసిన శ్రీగణపతి సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు

ఉగాది  ఉత్సవాలకు శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే కర్ణాటక భక్తులకు మజ్జిగ, బిస్కెట్లు  పంపిణీ చేసిన శ్రీగణపతి సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు

కర్నూలు,శివసూర్య, మర్చి 10
*ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి కాలినడకన వెళ్లే  కర్ణాటక భక్తులకు  శ్రీగణపతి సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్  ఆధ్వర్యంలో మజ్జిగ, బిస్కెట్లు, త్రాగునీరు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది*
*ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో,రోడ్డు మార్గంలో ప్రయాణించే పాదయాత్రికుల దాహార్తిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు* *కర్నూలు నగరంలో కొత్త బస్టాండ్ ఎదురుగా  వినయకుడి గుడి దగ్గర ప్రధాన రహదారిపై ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి, రెండు వేల మందికి పైగా భక్తులకు చల్లని మజ్జిగతో పాటు తాగునీరు మరియు బిస్కెట్లు ను అందజేశారు*
*ఈ సందర్భంగా  శ్రీగణపతి సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ “శివయ్య సేవలో తరిస్తున్న కర్ణాటక భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. గత మూడు సంవత్సరాలుగా  ఈ సేవా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము” అని పేర్కొన్నారు*
*ఈ కార్యక్రమంలో శ్రీగణపతి సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని  కర్ణాటక శివభక్తులకు సేవలు అందించారు. భక్తులు దాతల ఉదారతను అభినందిస్తూ తమ  శ్రీశైల యాత్రను కొనసాగించారు*