ఉగాది ఉత్సవాలకు శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే కర్ణాటక భక్తులకు మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేసిన శ్రీగణపతి సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు
కర్నూలు,శివసూర్య, మర్చి 10
*ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి కాలినడకన వెళ్లే కర్ణాటక భక్తులకు శ్రీగణపతి సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ, బిస్కెట్లు, త్రాగునీరు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది*
*ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో,రోడ్డు మార్గంలో ప్రయాణించే పాదయాత్రికుల దాహార్తిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు* *కర్నూలు నగరంలో కొత్త బస్టాండ్ ఎదురుగా వినయకుడి గుడి దగ్గర ప్రధాన రహదారిపై ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి, రెండు వేల మందికి పైగా భక్తులకు చల్లని మజ్జిగతో పాటు తాగునీరు మరియు బిస్కెట్లు ను అందజేశారు*
*ఈ సందర్భంగా శ్రీగణపతి సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ “శివయ్య సేవలో తరిస్తున్న కర్ణాటక భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. గత మూడు సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము” అని పేర్కొన్నారు*
*ఈ కార్యక్రమంలో శ్రీగణపతి సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కర్ణాటక శివభక్తులకు సేవలు అందించారు. భక్తులు దాతల ఉదారతను అభినందిస్తూ తమ శ్రీశైల యాత్రను కొనసాగించారు*
ఉగాది ఉత్సవాలకు శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే కర్ణాటక భక్తులకు మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేసిన శ్రీగణపతి సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు
RELATED ARTICLES

