SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 14 April 2025, 9:43 am Posted by : SHIVASURYA NEWS

ఉక్కునగరం శ్రీ సత్య సాయి సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన ఉక్కు డీజీఎం శ్రీమతి వి లీనా పురుషోత్తం

విశాఖపట్నం : జయజయహే : స్టీల్ ప్లాంట్ ఉక్కునగరంలో శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో వి ఎస్ జి హెచ్ బస్ స్టాప్ వద్ద చలివేంద్రం ను స్టీల్ ప్లాంట్ డీజీఎం (ఎంఎం) శ్రీమతి వి లీనా పురుషోత్తం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవి కాలం ఎండ తీవ్రతకు బాటసారిలకు జనరల్ హాస్పిటల్ కి వేళ్లు పేషెంట్స్ కు పాఠశాల విద్యార్థులకు ఈ చలివేంద్రం చాలా ఉపయోగపడుతుందని శ్రీ సత్య సాయి సేవా సమితి సేవలు అజారామం ఉచిత వైద్య శిబిరాలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎన్నో సేవలు చేస్తున్నారని అన్నారు కేరళ రాష్ట్రం ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఉక్కు గుర్తింపు నాయకులు బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ఉక్కు నగరంలో కేంద్ర బిందువుగా ఉండడం ఆ సత్య సాయి ఆశీస్సులు మనకందరికీ కలుగుతున్నాయని స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పుట్టపర్తిలో శ్రీ సత్య సాయి ఆశీస్సుల ఆశీస్సుల కొరకు నిత్యం సేవా చేస్తున్నారని అన్నారు. ఉక్కునగరం భగవాన్ శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ జి రామకృష్ణ మాట్లాడుతూ ఉక్కు నగరంలో ఇది 33 సంవత్సరం చలివేంద్రం సత్య సాయి బృందం సభ్యులు రెండు మాసాలు ఈ చలివేంద్ర నిర్వహణకు అహర్నిశల కృషి చేస్తున్నారని వారిని అభినందించారు. రాష్ట్ర సత్య సాయి సేవ సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉత్తమ సేవా సంస్థ అవార్డులను బహుకరించిందని అన్నారు. శ్రీ సత్య సాయి సేవాదళ్ ప్రతినిధి జై శ్రీ గణేశన్ సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీ సత్య సేవ ప్రతినిధులు నారాయణరావు ఆర్ఏ నాయుడు కె ఎస్ ఎన్ రాజు ఎస్ఎం విష్ణుమూర్తి ఎస్ కే ఆర్ కే రాజు బి రాఘవరావు రామచంద్ర పద్మ జయ సాయి విద్య మణి వెంకటేశ్వరరావు కృష్ణ మరియు సాయి భక్తులు చలివేంద్రముకు వచ్చే దాహార్తులు పాల్గొన్నారు.