SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 12:17 pm Posted by : SHIVASURYA NEWS

ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే

మాడుగుల: జయజయహే : స్వచ్ఛభారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం మాడుగుల గ్రామo లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ ను ఆయన సందర్శించి అధికారులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలకు అనుగుణంగా ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని పనికిరాని వస్తువులను ప్లాస్టిక్ సామాగ్రిని తొలగించి స్వచ్ఛత కేంద్రాలకు అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్షన్ సెంటర్లో గల వివిధ వస్తువులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్, మాడుగుల మార్కెట్ కమిటీ చైర్మన్ పూప్పల అప్పలరాజు, ఎండిఓ కె అప్పారావు, తహసిల్దార్ రమాదేవి, గ్రామ సర్పంచ్ కళావతి, ఉపసర్పంచ్ వరహాలు, ఈవో మూర్తి బాబు, పలువురు అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.