Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీఈనెల 24 నుంచి చైతన్య భారతి జాతీయస్థాయి నాటక పోటీలు

ఈనెల 24 నుంచి చైతన్య భారతి జాతీయస్థాయి నాటక పోటీలు

4 రోజులపాటు 10 నాటికలు.. 4 గురికి రంగస్థల నటులకు చైతన్య పురస్కారాలు, ఇరువురు సినీనటులు, దర్శకులకు ఆత్మీయ సత్కారం

భీమవరం : జయజయహే : ఈనెల 24,25,26,27 తేదీల్లో భీమవరంలోని డిఎన్నార్ కళాశాల క్రీడా మైదానంలో “చైతన్య భారతి 18వ జాతీయ స్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, కార్యదర్శి మంతెన రామకుమార్ రాజు, పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు ( బిఎస్ఆర్)తెలిపారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 24న కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జాతీయస్థాయి నాటిక పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. 27న ముగింపు కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషేన్ రాజు, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఈనెల 24న సినీ నటులు, రచయిత మిశ్రో కు చుక్కన సత్యనారాయణ రాజు రంగస్థల చైతన్య పురస్కారం, నటీమణి మణిబాల కు పెనుపోతుల శేషగిరిరావు రంగస్థల చైతన్య పురస్కారం, సినీనటులు రావు రమేష్ కు ఆత్మీయ చైతన్య పురస్కారం, 27న రంగస్థల నటులు బాలాజీ నాయక్ కు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారం, చవాకుల సత్యనారాయణ కు రాయప్రోలు రామచంద్ర మూర్తి రంగస్థల చైతన్య పురస్కారం, సినీ దర్శకులు వివేక్ ఆత్రేయ కు ఆత్మీయ సత్కారం జరుగుతాయని తెలిపారు.

4 రోజులు.. 10 నాటికలు

4 రోజులపాటు 10 నాటికలను నిర్వహిస్తున్నామని, ఈనెల 24న ఉషోదయ కళానినేతన్ కట్రపాడు వారిచే “కిడ్నాప్”, మైత్రి కళానిలయం హైదరాబాద్ వారి “బ్రహ్మ స్వరూపం”, 25న యువభేరీ థియేటర్ ఆర్గనైజేషన్ వారి “నా శత్రువు”, అమరావతి ఆర్ట్స్ వారి ” చిగురు మేఘం”, మద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్స్ చిలకలూరి పేట వారి “మా ఇంట్లో మహాభారతం”, 26న మహతి క్రియేషన్స్ వారి హైదరాబాద్ “ఉక్కు సంకెళ్ళు”, చైతన్య కళా స్రవంతి విశాఖ వారి “(అ) సత్యం”, మిత్రా క్రియేషన్ హైదరాబాద్ వారి * ఇది రహదారి కాదు”, 27న అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి “విడాకులు కావలి”, సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి “జనరల్ బోగీలు” నాటికలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ జాతీయస్థాయి నాటక పోటీలను అందరూ తిలకించి జయప్రదం చేయాలనీ కోరారు. సమావేశంలో వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, రాయప్రోలు శ్రీనివాస మూర్తి, బొండా రాంబాబు, పేరిచర్ల లక్ష్మణ వర్మ, చెఱకుపల్లి రవి, కట్రెడ్డి సత్యనారాయణ, నడింపల్లి మహేష్ వడుపు గోపి, పెన్నడ శ్రీను, k. V. రమణ మూర్తి, చిక్కాల బాబ్జి, బాబ్జి సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?