జయజయహే : భక్తులు తెల్లవారు జామున 4.౩౦ గంటలకు స్వామివారి దర్శనం, తర్వాత 8 గంటలకు దర్శనం హారతి మరియు గురు పూజ నిర్వహిస్తారు. ఈ పర్వదినం సందర్భంగా శ్రీ శ్రీ రాధా దామోదర్ ని ప్రత్యేకంగా బెంగళూరు మరియు దక్షిణ భారత దేశంలోని అనేక ఇతర నగరాల నుంచి తెప్పించిన వివిధ రకాల పువ్వులు, ఆభరణాలు, ప్రత్యేక దుస్తులతో అలంకరిస్తారు. శ్రీ శ్రీ రాధా దామోదరులు ప్రత్యేకంగా చందనంతో అలకరింపబడి భక్తులకు దర్శనమిస్తారు. ఆ తర్వాత, శ్రీమాన్ సాంబ దాస్ ప్రభుజీ నరసింహ స్వామి మరియు ప్రహ్లద మహారాజు లీలలను, నరసింహ చతుర్దశి యొక్క ప్రత్యేకతను వివరిస్తూ ప్రవచనం ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి ప్రజల అందరి క్షేమం కోసం నరసింహ యజ్ఞం నిర్వహిస్తారు. నరసింహ చతుర్దశి గురించి పూజ్య డాక్టర్ నితాయి సేవిని మాతాజీ యొక్క ఉపన్యాసంతో సాయంత్రం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తరువాత, భక్తుల హృదయాలలో ఆధ్యాత్మిక పారవశ్యం యొక్క అంతులేని తరంగాలను మేల్కొలిపే విధంగా కీర్తనలు ఆలపిస్తూ, నరసింహస్వామికి అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం తరువాత, స్వామిపై ప్రేమ నిండిన హృదయాలతో అనేక మంది భక్తులు తయారు చేసిన వందల రకాల రుచికరమైన వంటకాలను స్వామికి నివేదించడం జరుగుతుంది. తరువాత అందరికీ ప్రత్యేకమైన విందు ప్రసాదం వితరణ జరుగుతుంది.