ఇది రైతుల ప్రభుత్వం ..మంత్రి అచ్చెమనాయుడు
రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడమే కాకుం డా వారి బాగోగులపై తక్షణం స్పందిస్తున్నామని వ్యవ సాయ శాఖా మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. కోకో రైతుల సమస్యలపై శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కోకో కొనుగోలుపై ఒక నిర్ణయం తీసుకున్నామని, మద్యస్థ ధర ఉండేలా కంపెనీలతో మాట్లాడినట్లు తెలిపారు. కంపెనీలు రూ.450 ధరకే కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికి మరో రూ.50 ప్రభుత్వం భరించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. రైతుల వద్ద ఉన్న కోకో గింజలను రూ.500 ధరకు కొనుగోలు...