SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 12:15 pm Posted by : SHIVASURYA NEWS

ఇక భారత్‌పై ఏమాత్రం జాలి చూపను..

భారత్‌పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు

చనిపోయాడని అనుకున్న మసూద్ అజార్ రాసిన లేఖ సంచలనం

జయజయహే : ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా బవహల్పూర్‌ లోని జైష్-ఎ-మహమ్మద్‌ ప్రధాన స్థావరం అయిన సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో జైష్-ఎ-మహమ్మద్‌ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతమయ్యారు. అందులో అతడి అక్క, బావ, మేనల్లుడు, భార్య కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ పై విషం కక్కతూ.. మసూద్ అజార్ సంచలన లేఖ విడుదల చేశాడు. అందులో తాను కూడా చనిపోయి ఉంటే బాగుండేదని ప్రస్తావించాడు. ప్రధాని మోడీ కశ్మీర్ విషయంలో అన్ని నియమాలను ఉల్లంఘించారని ఆక్రోశించారు. భారత్‌పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశాడు. ఇక భారత్‌పై ఏ మాత్రం జాలి చూపబోమని బీరాలు పలికాడు. భయం లేదు.. నిరాశ లేదు.. దుఖం లేదంటూ చనిపోయాడని అనుకున్న మసూద్ అజార్ రాసిన లేఖ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.