SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 11:32 am Posted by : SHIVASURYA NEWS

ఆసుపత్రి నర్సులకు శుభాకాంక్షలు తెలిపిన ఎడిసి చైర్మన్ బలిరెడ్డి

అగనంపూడి జయ జయహే: అగనంపూడి ఏరియా ఆసుపత్రిలో ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా ఆసుపత్రి నర్సులకు శుభాకాంక్షలు తెలియచేసారు ఆసుపత్రి సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి ప్రతిజ్ఞ చేసి అనంతరం కేక్ కటింగ్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ మనుషుల సేవలను గుర్తించి వారి అంకితభావానికి గౌరవంగా తెలిపి ఈ దినోత్సవం ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తారు ఆమెను ఆధునిక నర్సింగ్ వ్యవస్థ స్థాపకురాలిగా పరిగణిస్తారు. కరోనా సమయములో నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులను బ్రతికించిన సంఘటనలు తీరు ఎనలేనిదని గుర్తుచేసారు, పేషెంట్స్, నర్సులు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలని ఈ సందర్బంగా కోరారు.