Wednesday, April 15, 2026
Homeశివ సూర్య డైలీఆపరేషన్ సింధూర్..!!ఉగ్రవాద స్థావరాల ధ్వంసం

ఆపరేషన్ సింధూర్..!!ఉగ్రవాద స్థావరాల ధ్వంసం

జయజయహే : ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. తొలి విడత ఆపరేషన్ లో పాక్ తో పాటుగా పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. వంద మంది వరకు ఉగ్రవాదులు మట్టిలో కలిసిపోయారు. ఆ తరువాత సరిహద్దు రాష్ట్రాల పైన డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. భారత్ సైన్యం వారి కుట్రలను సమర్ధంగా తిప్పి కొడుతోంది. ఈ సమయంలోనే జమ్ములో పాకిస్తాన్ డ్రోన్ల ను భారత్ పై ప్రయోగానికి స్థావరంగా వినియోగించు కుంటున్న టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఆ వీడియోను విడుదల చేసారు. భారత్- పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. పాకిస్థాన్‌ సరిహద్దుల్లో కాల్పులే కాకుం డా డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీనిపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి కూడా స్పందించారు. మరోవైపు శ్రీనగర్, పఠాన్‌కోట్‌ ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాక్​దాడులకు ప్రతీగా ఆ దేశానికి చెందిన మూడు వైమానిక స్థావరాలపై భారత్​విరుచుకుపడనట్లు సమచారాం. పాక్​జరిపిన దాడు ల్లో జమ్ముకశ్మీర్​కు అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ రాజ్‌కుమార్‌ థప్పా మృతి చెందారు. రాజౌరి పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్‌ ఫిరంగులు పడటం వల్ల ఆయన ప్రాణాలు కోల్పో యారు. రాజ్‌కుమార్‌ జిల్లా డెవలప్‌మెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనలో రాజ్​కుమార్ సహా ఐదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. అటు శ్రీనగర్ లో ఉదయం నుంచి భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. జమ్ము ప్రాంతంలో డ్రోన్లతో దాడి చేసేందుకు స్థావరంగా వినియోగించుకుంటున్న లాంచ్ ప్యాడ్ లను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. వీటి వీడియోలను విడుదల చేసింది. కాగా, పాకిస్థాన్‌లోని 4 ఎయిర్‌బేస్‌లపై మనం డ్రోన్‌ దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన ఏడీ రాడార్‌ను డ్రోన్లు ధ్వంసం చేశాయని భారత సైన్యం ప్రతినిధి ఖురేషీ వెల్లడించారు. పాకిస్థాన్ సైనిక బలగాలు ముందుకు వస్తున్నట్లు గమనించినట్లు చెప్పారు. పాకిస్థాన్‌ తన అసత్య ప్రచారాలను కొనసాగిస్తోందని మండిపడ్డారు. భారత్‌లోని పలు ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్లు పాక్‌ చేస్తు న్న ప్రచారం అవాస్తవం ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. పాక్‌ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో భారత సైన్యాధికారులు తిప్పి కొట్టారు. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఎయిర్‌ లాంచర్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?