ఆపరేషన్ సిందూర్ పై భద్రతా బలగాలకు అభినందనలు తెలిపిన కేబినేట్..
జయజయహే : పహల్గాంలో చేసిన ఉగ్రదాడికి కౌంటర్ గా నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ పై భారత సైన్యం మిసైల్స్ తో విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన ఈ దాడిపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సాహసోపేతంగా పాక్ పై కచ్చితమైన దాడి చేయించిన ప్రధాని మోడీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ సహచరులతో భేటీ అయిన ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై చేసిన ఆపరేషన్...