ఆధునిక నాటకం కొత్త పుంతలు తొక్కుతుంది .. రాష్ట్ర మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు అంజిబాబు, రామకృష్ణ రెడ్డి

భీమవరం : జయజయహే : భీమవరం డిఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న చైతన్య భారతి 18వ జాతీయస్థాయి నాటికల పోటీలు ఆదివారంతో ముగిసాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ రుద్రరాజు పద్మరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నాటకాలపై ప్రేక్షకుల నుంచి ఆదరణ...