ఆగస్టు 15 నుండి మహిళలు ఉచిత బస్సు..సీఎం చంద్రబాబు
ఏపీలోని మహిళలందరికీ టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించే తేదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలువరించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ సదుయం కల్పిస్తామని తాజాగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయగా.. అందులో పాల్గొన్న ముఖ్యమంత్రి.. ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. మహిళలకు అండగా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ఇప్పటికే కూటమి...