Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీఆకట్టుకున్న హెచ్ ఐ వి.. వీధి నాటికం

ఆకట్టుకున్న హెచ్ ఐ వి.. వీధి నాటికం

జాయజయహే : హెచ్ఐ వి పట్ల సమాజంలో అందరికీ అవగాహన కలిగి ఉన్నప్పుడే వ్యాధి నిర్మూలన సాధ్యపడుతుందన్న సందేశాన్ని ఇస్తూ కళాకారులు ప్రదర్శించిన వీధి నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ శాఖ, ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ శాఖ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ అధికారి నేతృత్వంలో ఎస్ వి డి ఎస్, సమీద ఎన్జీవోల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జాలారిపేట, గాంధీ బొమ్మ వద్ద ఈ వీధి నాటక ప్రదర్శన జరిగింది. హెచ్ఐవి సోకిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని, వారిని ముట్టుకున్న, వారు తిన్న కంచంలో మనం తిన్నా, వారి బట్టలు మనం వేసుకున్న వారికున్న హెచ్ఐవి మనకి సోకదని కళాకారులు నాటికలో చూపించారు. అటువంటి వారిని మనలో ఒకరిగా చూడాలి తప్పితే వారికి పట్ల వివక్ష చూపకూడదన్నారు. హెచ్ఐవి ఏఏ విధంగా సోకే అవకాశం ఉందో కళాకారులు నాటికలో వివరించారు. అనుమానం ఉంటే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఉన్న ఐసీటీసీ సెంటర్కు వెళ్లి రక్త పరీక్ష చేసుకోవడం ద్వారా మనకు హెచ్ఐవి సోకిందో లేదో తెలుసుకోవచ్చన్నారు. హెచ్ఐవి సోకిందని తెలుస్తే ఏఆర్టీ సెంటర్ కి వెళ్లి డాక్టర్ ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడి, ఎక్సర్సైజులు చేస్తూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా అందరిలాగే హ్యాపీగా ఎక్కువ కాలం జీవించవచ్చన్నారు. గర్భిణీ అయిన తల్లి తనకున్న హెచ్ఐవి బిడ్డకు సోకకుండా కాపాడుకోవాలంటే నెవర్ పిన్ సిరప్ ని వాడుతూ బిడ్డకు హెచ్ఐవి శోకకుండా కాపాడుకోవచ్చునని కళాకారులు నాటికలో చూపించారు. అలాగే హెచ్ఐవి యాక్ట్ – 2017 , హెచ్ఐవి టోల్ ఫ్రీ నెంబర్ 1097 గురించి కూడా కళాకారులు నాటికలో వివరించారు. నగరానికి చెందిన భద్రం ఫౌండేషన్ కళాకారులు ఆదినారాయణ, కుమారి, సముద్రం, డేవిడ్ రాజ్, శివజ్యోతి, వైశాలి నాటికలో పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ అధికారి సిహెచ్ పూర్నెంద్రబాబు ఆదేశాల మేరకు వైద్యాధికారిణి జి.పద్మజ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాజెక్ట్ సిపిఎమ్ ఉమామహేశ్వర రావు, డాప్ కు… జిల్లా సూపర్వైజర్ బద్రి, కృష్ణ ఎన్జీవో ప్రాజెక్ట్ మేనేజర్ రవి భాస్కర్, సమీద ప్రాజెక్ట్ మేనేజర్ ప్రసాదరెడ్డి,సిబ్బంది తదితర ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?