జయజయహే : అనకాపల్లి పట్టణంలో గుడ్ షెడ్ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు 101,వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్ . అల్లూరి సీతారామరాజు గురించి ఆళ్ళ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న మహనీయులు మన్నెం యోధుడు తెలుగు జాతి ముద్దుబిడ్డ బ్రిటీషర్లను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా పోరాటయోధుడికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కోరిబిల్లి పరమేష్, కొణతాల అప్పలరాజు, బిజెపి సాయి, గుప్తా రమేష్, నాగమణి, తల్లాడ కిరణ్, విల్లూరి సంతోష్, దాడి భాను అనిల్, మారిశెట్టి భాస్కర్, సంతోష్, ఒడిశెట్టి కనకరాజు, సాయిబాబా, ప్రసాద్, మరియు గుడ్ షెడ్ ప్రాంత వాస్తవ్యులు, అబ్దుల్ కలాం సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి
0
47
Previous article
RELATED ARTICLES

