మాడుగుల : జయజయహే : అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందని వాటిని సద్వినియోగపరుచుకోవాలని స్థానిక ఎమ్మెల్యే వండర్ సత్యనారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. గురువారం మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల కె కోటపాడు మండలం సూదివలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అలాగే దీపం-2 పధకం లో భాగంగా గ్యాస్ సిలిండర్ పంపిణి, పశువులకు నీటి తొట్టి ప్రారంభోత్సవం కూడా చేపట్టారు. కార్యక్రమంలో డ్వామా పిడి పూర్ణిమ దేవి, ఎంపీడీఓ , మండల, గ్రామ అధికారులు, మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.