SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 22 April 2025, 9:35 am Posted by : SHIVASURYA NEWS

అరకు ఎమ్మెల్యేకు ఘన సన్మానం

అరకులోయ : జయజయహే : అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం శాసన సభ్యులు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కి అరకువేలి మండలం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు అరకులోయ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల కార్యవర్గ కమిటీలో అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, శాలువాతో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం కృషీ చేయాలని నూతన కార్యవర్గ కమిటీ సభ్యులను సూచించారు. మరియు పార్టీ బలోపేతం కోసం కృషీ చేసి ప్రతీ ఒక్కరికీ గుర్తింపు కల్పిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పాంగి చిన్నరావు, అరకువేలి మండలం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్వభి రామ మూర్తి అరకువేలి మండలం సూపర్ జెడ్పీటీసీ కమ్మిడి అశోక్, అరకువేలి మండలం సూపర్ ఎంపీపీ, జన్ని నరసింహ మూర్తి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు , పాడి రమేష్, అరకువేలి మండలం వైస్ ఎంపీపీ, కిల్లో రామన్న , అరకువేలి మండలం టౌన్షిప్ ఎంపీటీసీ దురియా ఆనంద్, అరకు అసెంబ్లీ వైసిపి గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు పెట్టేలి శుక్ర , అరకు అసెంబ్లీ వైసీపీ మాజీ సమన్వయకర్త, శెట్టి అప్పలు , మండల నూతన ఉపాధ్యక్షులు గుడివాడ ప్రకాశ్, పల్టసింగి విజయ్ కుమార్ మరియు నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు మరియు అరకువేలి మండలం పరిధిలో గల ఎంపీటీసీలు, సర్పంచులు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.