అన్ ప్లాన్డ్.. అన్ షెడ్యూల్డ్: హఠాత్తుగా పంజాబ్ వెళ్లిన ప్రధాని మోదీ

జయజయహే: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం, శతృదేశ సైనికుల నుంచి ఎదుర్కొన్న ప్రతిదాడులు, మోర్టార్ షెల్స్ కాల్పుల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్‌‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటోన్నాయి. సాధారణ జనజీవనం ఏర్పడుతోంది. ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమౌతోన్నారు. ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా పంజాబ్‌లో పర్యటిస్తోన్నారు. అక్కడి ఆదమ్‌పూర్ ఎయిర్‌ బేస్‌ను సందర్శించారు. ఎయిర్ వారియర్‌లతో భేటీ అయ్యారు. పాకిస్తాన్‌తో యుద్ధ వాతావరణం, సీజ్ ఫైర్ తరువాత నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు....