వైస్ ప్రిన్సిపాల్, డీన్ వేధింపులే కారణమా?
విశాఖపట్నం జిల్లా తగరపువలస సమీపన సంఘీవలస అనిల్ నీరుకొండ వైద్య కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న మేడికో విద్యార్థి శనివారం కళాశాల భవనం పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ , డీన్ వేధింపులే కారణం అంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే సీరం శ్రీరామ ప్రణీత్ అనిల్ అనే విద్యార్థి రమణారెడ్డి నీరుకొండ కళాశాలలో నాలుగో సంవత్సరం పరీక్షలు రాస్తున్నాడు. తను పరీక్ష చూసి రాస్తున్నాడని వైస్ ప్రిన్సిపాల్, డీన్ అతని పట్టుకుని పేపర్ లాక్కొని నిన్ను సస్పెండ్ చేస్తాం డాక్టర్ పట్టా ఇవ్వమ అంటూ అందరి ముందు నానా దుర్భాషలాడారు. ప్రణీత్ 11 గంటల నుంచి ఒంటి గంట వరకు వారి ఇరువురిని కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడినప్పటికీ ఇవేవీ పట్టించుకోకుండా ప్రణీత్ కాలర్ పట్టుకుని ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి పంపించారని తోటి విద్యార్థులే చెప్తున్నారు. పరీక్ష రాయాలని తన భవిష్యత్తు నాశనం అవుతుందని బ్రతిమలాడినప్పటికీ నీలాంటి వ్యక్తి డాక్టర్ గా పనికిరాడు అని నువ్వు ఉన్నా లేకున్నా ఒకటేనని వైస్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి సుధాకర్ తోటి విద్యార్థుల ముందే అవమానపరచడంతో కళాశాలపై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడనీ చెబుతున్నారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పటికీ వైస్ ప్రిన్సిపాల్ పేపర్ల సర్దుకోవడంలోనే ఉన్నారని ఈ విషయం పట్టించుకోలేదని దాంతో తోటి విద్యార్థులందరూ మధ్యాహ్నం ఒంటిగంట నుండి భోజన సమయం అయినప్పటికీ రెండు గంటల సేపు నిరసన వ్యక్తం చేశారు. భీమిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురి లోఉంచారు. మృతి చెందిన విద్యార్థి ప్రణీత్ కళాశాలలో చాలా మంచిగా ఉండేవాడని, ఏదో చిన్న తప్పు చేస్తే దాన్ని పెద్దదిగా చూపించి డీన్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి తరచూ వేధిస్తున్నారని విద్యార్థులు చెప్పారు. విద్యార్థి తల్లిదండ్రులు విజయవాడలో నివాసం ఉంటున్నారని తెలిపారు. మృతి చెందిన విద్యార్థి తండ్రి శ్రీరామ్ రాంబాబు విజయవాడలో ఒక పుస్తకాలు షాప్ నడుపుతున్నారని వారు వచ్చేసరికి సమయం పట్టడం వలన మృతదేహాన్ని మార్చిలో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు తమ తోటి విద్యార్థి మృతికి చెందిన కారణంగా నాలుగు గంటలు మౌన ప్రదర్శన చేస్తూ విద్యార్థి మృతికి సంతాపం తెలిపారు.
వైస్ ప్రిన్సిపాల్ డీన్ పై పలు ఆరోపణలు.
వైస్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి డీన్ సుధాకర్ విద్యార్థులనీ తరచూ వేధిస్తున్నారని విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేస్తూ ఇవ్వకపోతే ఫెయిల్ చేయిస్తానని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డీన్ సుధాకర్ ఇబ్బంది పెట్టడమే కాకుండా అరాచకంగా వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఒక విద్యార్థి మృతికి కారణమైన వాళ్ళను విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ప్రణీత్ కేర్ టేకర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రణీత్ నాలుగేళ్లుగా చదువుతున్నప్పటికీ చిన్న పొరపాటును మందలించాల్సింది పోయి తోటి విద్యార్థుల ముందు అవమానపరచడమే కాకుండా షర్టు పట్టుకుని అవమానించడాన్ని జీర్ణించుకోలేని ప్రణీత్ ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. వర్ధమాన్ మృతికి కారణమైన వీరిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

